వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత,ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనారోగ్య కారణాలతో ఈరోజు నిర్వహించాల్సిన అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వైద్యులు ఆయనకు పూర్తి విశ్రాంతి అవసరమని సూచించారు. ఈ విషయాన్ని వైసీపీ అధికారికంగా వెల్లడించింది. పార్టీ ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా జగన్ ఆరోగ్య పరిస్థితిపై సమాచారం అందించింది.

