టీ20 ప్రపంచ కప్ 2026లో చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 10 వికెట్ల తేడాతో అలవోక విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. 15.2 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా ఛేదిందించింది. కివీస్ ఓపెనర్లు ఫిన్ అలెన్(84*; 50 బంతుల్లో ), టిమ్ సీఫర్ట్(89*; 42 బంతుల్లో) హాఫ్ సెంచరీలతో అజేయంగా నిలిచారు. కివీస్ బ్యాటర్ల భారీ షాట్లకు యూఏఈ బౌలర్ల దగ్గర సమాధానమే లేకుండా పోయింది.

