చిత్తూరు జిల్లా వి.కోటలో జర్నలిస్ట్ దారుణ హత్య ప్రముఖ ఛానల్ ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి ఉదయం వాకింగ్‌కు వెళ్లిన సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను లక్ష్యంగా చేసుకుని కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ఆయన ప్రాణాలు కోల్పోయారు.స్థానికంగా జర్నలిస్టుగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి కొన్ని సున్నితమైన అంశాలపై రిపోర్టింగ్ చేశారన్న కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో వి. కోటకు చెందిన రౌడీ షీటర్ తమీమ్‌ను ప్రధాన అనుమానితుడిగా పోలీసులు గుర్తించారు.

