తెలంగాణ చరిత్రలో మొదటి అతి పెద్ద డ్రగ్స్ కేసు హైదరాబాద్లోని చర్లపల్లిలో 12వేల కోట్ల విలువైన డ్రగ్స్ ఒక కంపెనీలో పట్టుబడటం దారుణమని, దీని వెనుకాల కాంగ్రెస్ నాయకుల హస్తం ఉందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ప్రవీణ్కుమార్ అన్నారు. దీనికి హోం మంత్రి నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం మహారాష్ట్ర పోలీసులు చెబుతుంటే తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నట్టు ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డి సౌరథ్యంలో నడుస్తున్న హోం శాఖ విఫలమైందని తెలిపారు.

