ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకల సందర్భంగా మంత్రి నారా లోకేష్ విడుదల చేసిన ‘కామన్ డిస్‌ప్లే పిక్చర్’ (CDP) ఇప్పుడు సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి చంద్రబాబు చేస్తున్న కృషిని ప్రతిబింబించేలా ఈ సీడీపీని రూపొందించడం విశేషం. మంత్రి లోకేష్ విడుదల చేసిన సీడీపీని తమ ప్రొఫైల్ పిక్చర్లుగా పెట్టుకుంటూ చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

