చంద్ర గ్రహణం కారణంగా మంగళవారం ఉదయం తిరుమల లోని శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి మాట్లాడుతూ క్యూలైన్లో ఉన్న ప్రతి భక్తుడికి దర్శనం చేయించిన అనంతరం ఆలయ ద్వారాలు మూసివేసినట్లు చెప్పారు. ఆలయ మూత సమయంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం, లడ్డూ విక్రయ కేంద్రాలు కూడా మూసి వేస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం ఆలయ శుద్ధి, పుణ్యహావచనం అనంతరం భక్తులను క్యూలైన్లలోకి అనుమతిస్తామని వివరించారు.

