సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు – ట్యాంకర్ ఢీకొట్టుకున్న సంఘటనలో ఏకంగా 42 మంది చనిపోయారు. మృతుల్లో 20 మంది మహిళలు కాగా.. 11 మంది చిన్నారులు ఉన్నారు. వీరంతా మక్కా నుంచి మదీనా వెళ్తున్న భారతీయ యాత్రికులు కావటం గమనార్హం. బదర్-మదీనా మధ్య ముఫరహత్ దగ్గర ఘటన జరిగింది. మృతుల్లో ఎక్కువమంది హైదరాబాద్ వాసులు ఉన్నారు.

