కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మే డే (కార్మిక దినోత్సవం) రోజే కార్మికుల పొట్ట కొట్టేలా వెయ్యి రూపాయలు పెంచడం మోదీ సర్కార్ ఇచ్చే కానుకనా? అని ఆయన ప్రశ్నించారు. కార్మికుల దినోత్సవం రోజే గ్యాస్ ధరలు పెంచి పేదల నడ్డి విరవడం శోచనీయమని, ఇది మోదీ కార్మికులకు ఇచ్చిన ‘విషాద కానుక’ అని ఎద్దేవా చేశారు.

