
ఆంధ్రప్రదేశ్‌లోని బాలయోగి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు మరియు కళాశాలల్లో పనిచేస్తున్న పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులకు హైకోర్టు తాత్కాలికంగా ఉపశమనం కల్పించింది. వీరిని విధులనుంచి తొలగించరాదని, అలాగే తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఉద్యోగాల్లో ఎటువంటి అంతరాయం కలిగించవద్దని హైకోర్టు ఆదేశించింది. సాంఘిక సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి, గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి, వివిధ జిల్లాల కోఆర్డినేటర్లు మరియు ప్రిన్సిపాళ్లకు నోటీసులు జారీ చేశారు.