మండల పరిధిలోని రేగుల గడ్డ సర్పంచ్ ధనావత్ గుణ నాయక్‌పై కొందరు దాడికి పాల్పడ్డారు. నిరూపయోగంగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని మరొక చోట పాతాలని చెప్పినందుకు ఆయనపై దాడికి దిగారు. ‘మా ఇంటి దగ్గర స్తంభాన్ని తరలించాలని చెబుతావా?’ అని చామల ఉపేందర్ రెడ్డి, చామల పెద్ద రామిరెడ్డిలు సర్పంచ్‌పై దాడి చేశారు. వారి దాడిలో సర్పంచ్ గుణ నాయక్‌కు గాయాలయ్యాయి. అవసరమున్న చోట విద్యుత్ స్తంభాల్ని ఏర్పాటు చేయాలనుకుంటే తనపై దాడి చేశారని సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

