దక్షిణ గాజా నగరం ఖాన్‌యూనిస్‌లో సైనికుల సాయుధ వాహనాన్ని పేల్చివేయడంతో ఏడుగురు ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు. వాహనానికి అమర్చిన పేలుడు పరికరాన్ని మంగళవారం పేల్చివేయడంతో ఈ సంఘటన జరిగిందని ఇజ్రాయెల్ మిలిటరీ అధికారి బుధవారం తెలిపారు. గాజాలో ఈ సంఘటన ఇజ్రాయెల్ మిలిటరీకి ప్రాణాంతకమైనది. హమాస్‌తో యుద్ధం 2023 అక్టోబర్7న ప్రారంభమైన నాటి నుంచి 860 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందగా, వీరిలో 400 మంది గాజాలోనే మృతి చెందారు.

