గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అక్కడ నివసిస్తున్న ఏపీ ప్రజలకు భరోసా ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం ఏపీ ఎన్నార్టీ (APNRTS) ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ 85000 27678 ను అందుబాటులోకి తెచ్చింది. గల్ఫ్ బాధితులు లేదా వారి కుటుంబ సభ్యులు మరింత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ apnrts.ap.gov.in ను సంప్రదించాలని సూచించారు. గల్ఫ్ ప్రాంతంలోని ఏపీ పౌరులందరూ తమ వివరాలను ఇండియన్ ఎంబసీలో నమోదు చేసుకోవాలని మంత్రి సూచించారు.

