నటుడు కోటా శ్రీనివాసరావు మరణంతో టాలీవుడ్ లో విషాదం అలముకుంది. ఆయన మరణవార్త విని ప్రముఖ తారలు కోటాతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సంతాపం ప్రకటించారు. చిరంజీవి, పవన్, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, రవితేజ, మంచు హీరోలతో పాటు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. కోటా శ్రీనివాసరావు మరణం తనను ఎంతో కలచివేసిందన్నారు మెగాస్టార్ చిరంజీవి, తాము ఇద్దరు ఒకేసారి ప్రాణం ఖరీదు సినిమాతో కెరీర్ ను స్టర్ట్ చేశామంటూ గతాన్ని గుర్తు చేసుకున్నారు మెగాస్టార్.

