మహిళా బిల్లు సభలో ప్రవేశపెట్టడం ఇది తొలిసారి కాదని లోక్ సభ సభ్యుడు గౌరవ్ గొగోయ్ తెలిపారు. ఇంత హడావుడిగా బిల్లును ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని.. డీలిమిటేషన్ కు మాత్రమే వ్యతిరేకమని తెలియజేశారు. జనగణన తర్వాత డీలిమిటేషన్ అన్నారని, డీలిమిటేషన్ ను రాజకీయ అస్త్రంగా వాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు.. మహిళా రిజర్వేషన్లకు, డీలిమిటేషన్ కు లింక్ పెడుతున్నారని, మూడేళ్లలో ఏం మారిందని, 815 స్థానాలు వస్తాయని కేంద్రం ఎలా నిర్ణయిస్తుంది..? గౌరవ్ గొగోయ్ ప్రశ్నించారు

