కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని టంబ్లర్ రిడ్జ్ స్కూల్ కాల్పుల ఘటనలో నిందితురాలు అక్కడే ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఈ కాల్పులకు పాల్పడింది 18 ఏళ్ల ట్రాన్స్ ఉమన్ అయిన జెస్సె వాన్ రూట్‌సీలర్‌గా గుర్తించారు. చదువుకున్న స్కూల్‌లోనే కాల్పులు జరిపింది. స్కూల్‌లోకి రావడానికి ముందు వారి ఇంటిలో తన తల్లి ని, సవతి సోదరుడి (11)ని కూడా కాల్చి చంపినట్లు గుర్తించారు. మగవాడిగానే జన్మించిన జెస్సె ట్రాన్స్ ఉమన్‌గా మారింది. జెస్సె చాలా కాలంగా మానసిక సమస్యలతో బాధపడుతోంది. ఆమెకు కౌన్సెలింగ్ కూడా జరుగుతోంది.

