“లోక్సభలో బిల్లును ఆమోదింపజేయడంలో మేము సఫలం కాలేకపోయాం. మహిళలందరి బాధ, తీవ్ర నిరాశలను నేను కూడా పంచుకుంటున్నాను. ఈ రోజు బిల్లు ఆమోదానికి అవసరమైన 66 శాతం ఓట్లను సభలో మనం సాధించలేకపోవచ్చు. కానీ, దేశవ్యాప్తంగా ఉన్న మాతృమూర్తులు, సోదరీమణుల వంద శాతం మద్దతు, ఆశీస్సులు మా వెంటే ఉన్నాయని నాకు పూర్తిగా తెలుసు” అని ప్రధాని మోదీ ఎంతో ఉద్వేగంగా ప్రసంగించారు. కేవలం రాజకీయ స్వార్థం కోసమే కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ చారిత్రక బిల్లును అడ్డుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

