తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దానం వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇతర ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదని, తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అని దానం నాగేందర్ కుండబద్దలు కొట్టారు. త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి తాను కృషి చేస్తానని దానం నాగేందర్ స్పష్టం చేశారు.

