తెలంగాణ అభివృద్ధిలో తీవ్రమైన క్షీణత కనిపిస్తోంది. ఇదంతా చూడాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు అని తాజా కాగ్ నివేదిక అందుకు అద్దం పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం 6 గ్యారంటీలను ఇచ్చింది. కానీ అదే హామీలు తెలంగాణ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయి. ఆర్థిక రంగానికి హామీలే తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. తెలంగాణ ప్రభుత్వ ఆదాయం తగ్గుముఖం పడుతోంది, కాంగ్రెస్ నేతల అనుభవ లేమి, పాలనా వైఫల్యంతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పతనం అవుతోంది.

