కవిత మాజీ సీఎం KCR చుట్టూ దెయ్యాలు ఉన్నాయని అన్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు గుర్తు చేశారు. కవిత కూడా కొరివి దెయ్యమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ హయాంలో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని కవితనే చెప్పారని తెలిపారు. తాను ఆనాడు మంత్రి పదవి కోసం BRS పార్టీలోకి రాలేదని పేర్కొన్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పాతర వేసిందని విమర్శించారు. కవిత కొంత దాచిపెట్టి.. కొంత మూసిపెట్టి మాట్లాడుతున్నారని జూపల్లి ఆరోపించారు.

