ఎమ్మెల్సీ కవితకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇటీవల కవిత ప్రవర్తన పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నందున పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ప్రెస్ నోట్లో పేర్కొన్నారు.నిన్న కవిత విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించేలా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా పార్టీ ముఖ్య నేత అయిన హరీష్ రావుపై కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

