బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ‘కల్కి’ రెండో భాగం పనుల్లో బిజీగా ఉన్నారు. అమితాబ్, కమల్ హాసన్ లాంటి మహానటులు ఒకే తెరపై కనిపించడం అమితాబ్, కమల్ దశాబ్దాల తర్వాత మళ్లీ కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించనున్నారు. 1985లో వచ్చిన ‘గేరాఫ్తార్’ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఈ ఇద్దరూ ఒకే ప్రాజెక్ట్‌లో కనిపిస్తున్నారు. దాదాపు 40 ఏళ్ల విరామం తర్వాత ఈ ఇద్దరు లెజెండ్స్ ఒకే చోట కలుసుకోవడం నిజంగా అరుదైన విషయం.

