కర్ణాటక కాంగ్రెస్లో కలకలం చోటుచేసుకుంది. కర్ణాటక సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న తన పదవికి రాజీనామా చేశారు. సొంత పార్టీపైనే కేఎన్ రాజన్న తీవ్ర ఆరోపణలు చేశారు. మహాదేవపురలో ఓట్ల చోరీకి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్ మంత్రి సొంత పార్టీపైనే ఆరోపణలు చేయడం పార్టీకి ఇబ్బంది కలిగించే అంశంగా మారింది. ఈ క్రమంలోనే మంత్రి పదవి నుంచి కేఎన్ రాజన్న వైదొలగాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించినట్టుగా తెలుస్తోంది.

