కరీంనగర్ జిల్లా కేంద్రంలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. నగరంలోని పిఎంజె జ్యువెలరీ షాపులోకి చొరబడిన ఐదుగురు సాయుధ దుండగులు సిబ్బందిపై విచ్చక్షణారహితంగా కాల్పులు జరిపి భారీ మొత్తంలో ఆభరణాలను దోచుకెళ్లారు. రెండు బైకులపై వచ్చిన నలుగురు దుండగులు పిఎంజె జ్యువెలరీ షాపులోకి ప్రవేశించారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన షాపు సిబ్బందిపై దుండగులు తుపాకులతో కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో సిబ్బంది ఒకరు మరణించగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

