‘కన్నడ తమిళం నుంచి పుట్టింది’ అన్న కమల్ వ్యాఖ్యలపై కర్ణాటకలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కమల్ హాసన్ కామెంట్స్ పై కన్నడ నటి, మాజీ ఎంపీ రమ్య స్పందించింది. సోషల్ మీడియాలో నటి రమ్య, ద్రావిడ భాషల మూలం చార్ట్‌ను షేర్ చేశారు. రమ్య పంచుకున్న పట్టిక ప్రకారం, తమిళం, కన్నడ, తెలుగు, మలయాళం తదితర భాషలు ద్రావిడ భాష కిందకు వస్తాయని పేర్కొంటూ రమ్య ఒక సందేశాన్ని కూడా షేర్ చేసింది.

