కడప నగర పాలక సంస్థ మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేటర్లు, ఎక్స్అఫీషియో సభ్యులు ప్రత్యేక సమావేశానికి హాజరు కావాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత సురేశ్ బాబును మేయర్ పదవి నుంచి తొలగిస్తూ ఇటీవల ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

