రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ చూస్తోందని, కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘ఓట్ చోర్-గద్దీ ఛోడ్’ పేరుతో దిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ మహా ధర్నాలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఆర్ఎస్ఎస్, గోల్వాల్కర్ భావజాలంతో ఉన్న నరేంద్ర మోదీ, అమిత్ షా కేంద్రంలో భావజాలాన్ని అమలు చేసేందుకు 400 సీట్లు కావాలని కోరుకున్నారని, బీజేపీకి 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు ఎత్తివేస్తారని ఆ పార్టీని 240 సీట్లకు పరిమితం చేశారని పేర్కొన్నారు.

