ఐర్లాండ్ అధ్యక్ష ఎన్నికల లో వామపక్షవాద స్వతంత్ర నేత కేథరీన్ కన్నోలి ఏకపక్షంగా ఘన విజయం సాధించారు. ఆమెకు సిన్ ఫెయిన్తోపాటు వామపక్ష పార్టీలన్నీ మద్దతిచ్చాయి. దాంతో ఆమె ప్రత్యర్థి, సెంటర్ రైట్ పార్టీ అయిన ఫైన్ గాయెల్ అభ్యర్థి హీథర్ హంప్రేయ్స్ ఘోర పరాజయం పాలయ్యారు. ఈ ఎన్నికల్లో కేథరీన్కు మొదటి ప్రాధాన్య ఓట్లలోనే ఏకంగా 63 శాతం ఓట్లు దక్కాయి. గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఆమె బహిరంగంగా వ్యతిరేకించారు. ఇజ్రాయెల్ను టెర్రరిస్టు దేశంగా అభివర్ణించారు.

