ఢిల్లీలో కైలాశ్ హిల్స్‌లో ఒక సీనియర్ ఐఆర్ఎస్ (IRS) అధికారి కుమార్తె 22 ఏళ్ల వయసున్నఐఐటీ పట్టభద్రురాలు. ఆమె తల్లిదండ్రులు లేని సమయములో ఇంట్లో గతంలో పని చేసిన యువకుడు.. ఇంట్లోకి చొరబడి ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో స్టిక్‌తో తలపై బలంగా కొట్టాడు. అనంతరం అత్యాచారం చేసి, మొబైల్ ఛార్జింగ్ కేబుల్‌ను ఆమె మెడకు బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. నిందితుడి పేరు రాహుల్ మీనా అని.. అతడు 8 నెలలపాటు తమ ఇంట్లోనే పని చేశాడని చెప్పారు.

