ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ‘కీ స్పీకర్స్’ జాబితా నుంచి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ పేరును కేంద్రం తొలగించినట్లు సమాచారం. బాధితుల పక్షాన నిలబడేందుకే బిల్ గేట్స్ కు నో ఎంట్రీ అంటూ కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎప్స్టీన్ ఫైల్స్ బిల్ గేట్స్‌పై ఆరోపణల నేపథ్యంలో ఆహ్వానంపై కేంద్ర ప్రభుత్వం పున:సమీక్ష జరిపినట్లు సమాచారం. బిల్ గేట్స్ వివాహేతర సంబంధాలకు ఎప్స్టీన్ సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి.

