
కావాలనే తనపై కొంతమంది బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట వినుత డ్రైవర్ రాయుడు పేరుతో విడుదలైన వీడియోపై పోలీసుల విచారణ జరగాలని కోరారు. ఈ విషయంలో ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. తనకు వినుత డ్రైవర్ రాయుడు తెలియదని క్లారిటీ ఇచ్చారు. వినుత బెయిల్ రద్దు చేయాలని కోరారు.