రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని కొత్వాల్‌గూడలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న స్టోన్ క్రషర్లను హైడ్రా కూల్చివేసింది. రాఘవ క్రషర్స్‌తో పాటు పలు కంపెనీలకు చెందిన ఐదు క్రషర్ మెషిన్లతో పాటు 12 ఆర్ఎంసీ యూనిట్లను తొలగించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ ఏకంగా జీవో 111ను ఉల్లంఘిస్తూ క్రషర్స్ నడుపుతున్నా.. రెండేండ్లుగా నిరాటంకంగా అక్రమ మైనింగ్ కొనసాగుతున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదని కొంతకాలంగా స్థానికులు విమర్శిస్తున్నారు.

