దేశ రాజకీయ పరిణామాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌ను కలిశారు. ఇటీవలే ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన రాధాకృష్ణన్‌ను ప్రధానమంత్రి… ఆయన నివాసం, వైస్ ప్రెసిడెంట్ ఎన్‌క్లేవ్ వద్ద కలసి శుభాకాంక్షలు తెలిపారు. “గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, నేడు గౌరవనీయ ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ గారిని వైస్ ప్రెసిడెంట్ ఎన్‌క్లేవ్‌లో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు” అని పోస్ట్‌లో పేర్కొంది. ప్రధాని మోదీ కూడా ఈ భేటీ గురించి ట్వీట్ చేశారు.

