ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికపై వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి CP రాధాకృష్ణన్‌కు వైసీపీ మద్దతిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగ బద్ధమైన పదవులకు నెంబర్ గేమ్ ఉండకూడదనేదే వైసీపీ విధానమని ఆయన చెప్పుకొచ్చారు. పార్టీ స్థాపించిప్పటి నుంచి తాము ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

