బెంగళూరు నగరంలోని వైట్‌ఫీల్డ్‌లోని వర్తూర్ మెయిన్ రోడ్డు పరిస్థితిని వివరిస్తూ మాజీ జర్నలిస్ట్ జైషా అమ్లాని ఈ భూమిపై ఉన్న అత్యంత ప్రమాదకరమైన రోడ్డుపైకి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను అంటూ వీడియోను పోస్ట్ చేశారు. ఒక గుంత ఏకంగా 117 అంగుళాల పొడవు, 56 అంగుళాల వెడల్పు ఉందని టేపు సాయంతో కొలతలు వేసి మరీ లెక్కించారు. ఇక ఆ వీడియో తీస్తున్న సమయంలో తాను ప్రమాదవశాత్తు కిందపడటంతో మోకాలికి గాయం కూడా అయిందని చెప్పారు.

