భారత్, అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక వాణిజ్య ఒప్పందపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు మోదీ. భారత్, అమెరికాలకు ఇది గ్రేట్ న్యూస్. ఇరుదేశాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి ఫ్రేమ్ వర్క్ ఖరారు చేశాం. ఇరుదేశాల మధ్య బలమైన సంబంధాల కోసం, వ్యక్తిగత నిబద్ధతతో కృషిచేసిన డొనాల్డ్ ట్రంప్‌నకు కృతజ్ఞతలు.

