ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో రెండు పక్షాల మధ్య అవసరమైతే మధ్యవర్తిత్వం వహిస్తామని చైనా ప్రకటించింది. దీనిపై ఇప్పటికే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి గల్ఫ్ దేశాధినేతలతో ఫోన్‌లో చర్చలు జరిపారని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ వెల్లడించారు. దౌత్యపరమైన చర్చల ద్వారా యుద్ధానికి ముగింపు పలికేలా, శాంతి నెలకొనేలా చూస్తామని ఆయన అన్నారు. ఈ ప్రయత్నంలో చైనా చివరిదాకా ప్రయత్నిస్తుందని, నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది.

