పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురైనట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇమ్రాన్ ఖాన్‌ను చూసేందుకు ఆయన కుటుంబ సభ్యులను అనుమతించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇమ్రాన్ పార్టీ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఇమ్రాన్‌కు మద్దతుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ ఇస్లామాబాద్, రావల్పిండిలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టనున్నారు. రెండు నగరాల్లో సెక్షన్ 144 విధించారు.

