ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూటమి ప్రభుత్వం సూపర్సిక్స్ హామీలను అమలు చేస్తోందని స్పష్టం చేశారు. రాయలసీమను నిజమైన రతనాల సీమగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పవన్ కల్యాణ్ తెలిపారు. “ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పించాం. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో గ్రామసభలు నిర్వహించాం. కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాం. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నాం,” అని వివరించారు.

