యూరోప్ పరిధిలో అనుకోకుండా ఆకాశంలో భారీ సంఖ్యలో డ్రోన్లు కనిపించడం పెద్ద గందరగోళానికి దారి తీసింది. దీంతో కోపెన్హేగెన్ (డెన్మార్క్), ఒస్లో (నార్వే) ఎయిర్పోర్టులు డ్రోన్ల కారణంగా సజావుగా పనిచేయలేకపోయాయి. విమానాల ప్రయాణానికి అంతరాయం ఏర్పడింది. అప్రమత్తమైన అధికారులు 40కిపైగా విమానాలను రద్దు చేశారు. మరికొన్ని విమానాలను ఇతర ఎయిర్పోర్టులకు మళ్లించారు. ఈ సంఘటనలు ప్రయాణికులకు ఇబ్బందులను కలిగించాయి.

