ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అడుగులు వేగవంతం చేస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే కీలక నామినేటెడ్ పదవుల భర్తీ ప్రారంభించింది. ఈ క్రమంలో 31 మంది నేతలకు పదవులు కేటాయిస్తూ జాబితాను విడుదల చేసింది.
జనసేనకు మూడు, బీజేపీకి రెండు పదవులు ఇచ్చారు. మొత్తం 31 పదవుల్లో 17 స్థానాలను బీసీలకు కేటాయించారు. ఓసీలకు 6, ఎస్సీలకు 4, ఎస్టీలకు 1, మైనారిటీలకు 2 పదవులు కేటాయించారు.

