చనాక కొరాట, సదర్మాట్ ప్రాజెక్టులు ప్రారంభోత్సవానికి సిద్ధం కావడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో ప్రారంభమై.. 90 శాతానికి పైగా పనులు పూర్తి చేసుకున్న రెండు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవాళ ప్రారంభం కావడం సంతోషదాయకమని అన్నారు. 0.98 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యంతో నిర్మించిన చనాక కొరాట బరాజ్ బీఆర్ఎస్ హయాంలోనే 95% పనులు పూర్తయ్యి, సెప్టెంబర్ 2023లో ట్రయల్ రన్ కూడా అయ్యిందని తెలిపారు.

