పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో ఓ మహిళ విజయం ఆసక్తికరంగా మారింది. భాజపా తరఫున పోటీ చేసిన కలితా మాఝీ.. ఔస్‌గ్రామ్ నియోజకవర్గంలో గెలుపొందారు. టీఎంసీ అభ్యర్థిపై 12,535 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కలితా.. గతంలో పలు ఇళ్లలో పనిమనిషిగా చేశారు. నెలకు రూ.2,500 సంపాదించేవారు. 2021లో భాజపా టికెట్‌పై పోటీ చేసిన ఆమె.. 11వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయినప్పటికీ భాజపా మరోసారి టికెట్ ఇవ్వడంతో ఆమె నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు.

