సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఉన్న అమెరికా ఎంబసీపై డ్రోన్ల దాడి జరిగిన నేపధ్యంలో బహ్రైన్, కువైట్, లెబనాన్, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, గాజా, జోర్డాన్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, యెమెన్ దేశాల్లోని పౌరులు వెంటనే దేశాలు విడిచిపెట్టాలని అమెరికా సూచించింది. తాజా దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పేరు ప్రస్తావించకుండా హెచ్చరికలు చేశారు. రియాద్‌లోని తమ ఎంబసీపై జరిగిన దాడి అమెరికన్ సైనికుల హత్యకు ప్రతిస్పందన ఎలా ఉంటుందో వారు త్వరలోనే తెలుసుకుంటారని వార్నింగ్ ఇచ్చారు.

