
విశాల్ తన పోడ్‌కాస్ట్ లో అవార్డుల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. “అవార్డులు కేవలం కమీటీ సభ్యుల నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి. 8 కోట్ల మంది లేదా 80 కోట్ల మంది ఇష్టపడే సినిమాకి అవార్డు ఇవ్వాల వద్దా అనేది కేవలం 8మంది సభ్యులు నిర్ణయించడం సరైన విధానం కాదు. ఇది నేషనల్ అవార్డులకు సైతం వర్తిస్తుంది. నావరకు నేను అవార్డుల్ని నమ్మను. ఎవరైనా నాకు అవార్డు ఇస్తే దాన్ని చెత్తబుట్టలో పడేస్తాను’ అని చెప్పుకొచ్చారు.