అట్లాంటిక్ సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ క్రూజ్ షిప్లో అరుదైన హంటా వైరస్ వెలుగుచూసింది. ఈ వైరస్‌బారిన పడి నౌకలోని ముగ్గురు చనిపోగా, మరో ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఈ నౌక అట్లాంటిక్ సముద్రంలో కేప్ వెర్డె తీరంలో నిలిచి ఉంది. దీంతో అందులోని 150 మంది ప్రయాణికులు భయాందోళనలతో సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విషయాన్ని షిప్ ఆపరేటర్‌తో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించింది.

