అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పలు దేశాలపై సుంకాలు విధించి దారికి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. ట్రంప్ సుంకాల కారణంగా అమెరికాలో పలు వస్తువుల ధరలు పెరిగిపోయాయి. వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో ఒత్తిడికి తలొగ్గిన ట్రంప్.. ఆహార ఉత్పత్తులపై సుంకాలను తొలగించారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. అమెరికాకు బ్రెజిల్ నుంచి భారీగా గొడ్డు మాంసం ఎగుమతి అవుతుంది. బ్రెజిల్‌పై కూడా ట్రంప్ భారీ సుంకాలు విధించారు. దాంతో గొడ్డు మాంసం ధర భారీగా పెరిగిపోయింది.

