
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్, వారి ముగ్గురు పిల్లలు భారత్‌కు విచ్చేశారు. ఢిల్లీలోని పాలం ఎయిర్ పోర్టులో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఘన స్వాగతం పలికారు. అమెరికా ఉపాధ్యక్షుని పర్యటన కావడంతో భద్రతా ప్రోటోకాల్ ప్రకారం ఇప్పటికే మాక్ డ్రిల్ చేశాం. సెక్యూరిటీ కట్టుదిట్టం చేశాం. జేడీ వాన్స్ ఫ్యామిలీ భారత సందర్శన సమయంలో ప్రతిదీ సజావుగా సాగేలా చూడటంలో భాగంగా ఢిల్లీలోని అన్ని ప్రాంతాలలో భద్రతను కట్టుదిట్టం చేశాం” అని ఒక ఉన్నతాధికారి తెలిపారు.