
జేడీ వాన్స్ సతీమణి, తెలుగు మూలాలున్న ప్రవాస భారతీయురాలు ఉషా చిలుకూరికి కేంద్ర రైల్వే శాఖ అరుదైన గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కృష్ణా జిల్లా ఉయ్యూరు సాయిపురం గ్రామం సమీపంలో ఉషా వాన్స్ కుటుంబ సభ్యుల మూలాలున్నాయి. ఉషా వాన్స్ తల్లి తండ్రులు శ్రీలక్ష్మీ,రాధాకృష్ణలు 1970 దశకంలో వలస వెళ్లారు. ఉషా వాన్స్ మూలాలు ఉన్న కృష్ణా జిల్లా ఉయ్యూరు గ్రామ సమీపంలోని రైల్వే స్టేషన్ మెమోంటోను గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మెమెంటోను బహుకరించనున్నారు.