అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా, ముందస్తు జాగ్రత్త చర్యగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న అమెరికా కాన్సులేట్ వద్ద భద్రతను భారీగా పెంచారు. ఇందులో భాగంగా కాన్సులేట్‌కు వెళ్లే ప్రధాన రహదారిని పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. కాన్సులేట్ పరిసరాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించడమే కాకుండా, ఆ మార్గంలో వెళ్లే వాహనాలపై ఆంక్షలు విధించారు.

