ఐపీఎల్‌లో ప్రతిసారి గట్టి పోటీనిచ్చే లక్నో సూపర్ జెయింట్స్ కొత్త లోగో ఉత్తరప్రదేశ్.. లక్నో పట్టణ విశిష్టతను, స్ఫూర్తిగాథను చాటేలా సరికొత్తగా.. అభిమానులకు అమితంగా నచ్చేలా రూపొందించారు. తాజా లోగోలో శక్తివంతమైన గరుడు, కిరీటం, ఏనుగు బొమ్మలు ఉన్నాయి. గరుడ (గరుత్మంతుడు) చిహ్నం ధైర్యానికి ప్రతీక. కిరీటం విషయానికొస్తే దర్పం, బాధ్యతకు ప్రతీక కొత్త లోగుకు ఏనుగు బొమ్మ గుండెతో సమానం. బలం, తెలివి, ఓపిక, ఐక్యత.. ఈ లక్షణాలకు ప్రతిరూపమే ఏనుగు.

